: టీడీపీ ఏజెంట్ కిడ్నాప్
సీమాంధ్రలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఒకటైన పల్నాడులో ఓటింగ్ ఉద్రిక్త పరిస్థితుల మధ్య జరుగుతోంది. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం రామిరెడ్డి పాలెంలో టీడీపీ పోలింగ్ ఏజెంట్ ను వైకాపా వర్గీయులు కిడ్నాప్ చేశారు. దీంతో పోలింగ్ బూత్ దగ్గర ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో, టీడీపీ, బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.