: కడప జిల్లాలో టీడీపీ అభ్యర్ధులపై దాడులు
కడప జిల్లా చాపాడు మండలం వెదురూరులో టీడీపీ అభ్యర్ధి పుట్టా సుధాకర్ కారుపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆయన ప్రయాణిస్తున్న కారుపై రాళ్లతో దాడికి దిగారు. పోలీసుల రాకతో వారంతా పరారయ్యారు. ఇక జమ్మలమడుగు నియోజకవర్గం టీడీపీ అభ్యర్ధి రామసుబ్బారెడ్డిపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారు. దాడి అనంతరం ఇద్దరు ఏజెంట్లను వైఎస్సార్సీపీ కార్యకర్తలు అపహరించారు.