: సీమాంధ్రులతో కిటకిటలాడుతున్న సికింద్రాబాద్ స్టేషన్


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. రేపు సీమాంధ్రలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ఆయా జిల్లాలకు చెందిన వారంతా ఊళ్లకు బయల్దేరారు. దీంతో రైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రయాణికులు పెద్ద ఎత్తున ఉండడంతో గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కుతుండగానే కదిలిపోయింది. దీంతో ప్రయాణికులు గొలుసు లాగి ఆపారు. గోదావరి, విశాఖ ఎక్స్ ప్రెస్... సీమాంధ్ర మీదుగా వెళ్తున్న రైళ్లన్నింటిదీ ఇదే పరిస్థితి. విశాఖ, శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ వంటి ప్రాంతాలకు వెళ్లే వారితో రైల్వే స్టేషన్ కిటకిటలాడుతోంది.

  • Loading...

More Telugu News