: నగ్న అధ్లెట్ ను ఢీ కొట్టిన నల్లకారు


పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అని పెద్దలు చెప్పినట్టు అమెరికాలోని ఒరెగన్ రాష్ట్రంలో పోర్ట్ లాండ్ లో నడిరోడ్డు మీద ఓ పెద్దమనిషి నగ్నంగా జాగింగ్ చేస్తూ, మధ్యమధ్యలో పుషప్స్ చేస్తూ ఆనందిస్తున్నాడు. దీనిని చూసిన ప్రజలు, 'ఇదేంట్రా బాబు... పెద్దమనిషి ఉచితంగా సినిమా చూపించేస్తున్నాడ'ని అనుకుంటూ...పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు రాకపోవడంతో అతన్ని అడ్డుకోవాలంటూ స్థానికులు మరోసారి ఫోన్ చేశారు.

వారు హడావుడిగా బయల్దేరుతుండగా మూడో ఫోన్ వచ్చింది. నగ్న అధ్లెట్ ను నల్లకారు ఢీ కొట్టేసి వెళ్లిపోయిందని సమాచారం వచ్చింది. పోలీసులు వచ్చి అతని శవాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా, అతడిని డీ కొట్టిన కారు డ్రైవర్ పోలీసులు వచ్చేవరకు అక్కడే ఉండి, వారికి పూర్తిగా సహకరించడం విశేషం.

  • Loading...

More Telugu News