: బీజేపీ ఉన్నది కార్పొరేట్ల కోసమే: రాహుల్
బీజేపీ అధికారంలోకి వస్తే కార్పొరేట్లకు మేలు చేసేందుకు దేశాన్ని లూటీ చేస్తుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో ఆయన ప్రసంగిస్తూ, బీజేపీ ఉన్నది కార్పొరేట్ల కోసమే కాని సామాన్యుల కోసం కాదని చెప్పారు. కులం, మతం పేరిట ప్రజలను విభజించి... ఓట్లను రాబట్టుకునేందుకు బీజేపీ నేతలు యత్నిస్తున్నారని విమర్శించారు.