: ప్రేమకు శిక్ష... చెల్లి గొంతు నొక్కి చంపేసిన అన్నయ్యలు


చెల్లెలి ప్రేమకు ఆమె ఇద్దరు అన్నలు పెద్ద శిక్షే విధించారు. పరువు హత్యలు రాజ్యమేలుతున్న ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఈ సంఘటన సంచలనం సృష్టించింది. ముజఫర్ నగర్ జిల్లాలోని బుఢానా నగరంలోని ఒక యువతి ముబారక్ హుసేన్ అనే యువకుడిని ప్రేమించింది. ఇది ఇష్టం లేని ఆ యువతి అన్నలు అహసాన్, అశూలు ఆమెతో వాగ్వాదానికి దిగారు. కోప్పడ్డారు, మందలించారు, తిట్టారు, కొట్టారు. అయినా ఆమె ముబారక్ ను మర్చిపోయేది లేదని తేల్చిచెప్పడంతో, ఆగ్రహంతో వారిద్దరూ ఆమె గొంతు నులిమి చంపేశారు.

తాము చేసిన తప్పు బయటపడకుండా ఆమెను సీలింగ్ ఫ్యాన్ కి వేలాడదీసి ఉరేసుకున్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన ప్రేమికుడు ముబారక్ హుసేన్ అదే ఊళ్లో ఉరేసుకుని చనిపోయాడు. వారి శవాల్ని పోస్ట్ మార్టమ్ కు తరలించగా, రిపోర్టులో అమ్మాయి గొంతు పిసికి చంపేశారన్న సంగతి బయటపడింది. దీంతో అన్నలిద్దరూ పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News