: 'స్నూప్ గేట్' కేసులో దర్యాప్తుపై స్టే కోరుతూ సుప్రీంలో పిటిషన్
ఓ మహిళపై 2009లో రహస్యంగా నిఘా పెట్టిన 'స్నూప్ గేట్' కేసులో ప్రత్యేక న్యాయమూర్తితో దర్యాప్తు చేయిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, ఈ దర్యాప్తుపై స్టే ఇవ్వాలని కోరుతూ సదరు మహిళ తండ్రి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు వల్ల వివాహిత అయిన తన కుమార్తె వ్యక్తిగత జీవితానికి భంగం వాటిల్లుతుందని పేర్కొన్నారు. ఆ వెంటనే ఈ పిటిషన్ ను పరిశీలించిన సుప్రీం శుక్రవారంలోగా వివరణ ఇవ్వాలంటూ కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలకు నోటీసులు పంపింది.