: ఇంటర్నెట్ సెంటర్ పై దాడి, నీలి చిత్రాల సీడీలు సీజ్


ఇంటర్నెట్ నుంచి నీలి చిత్రాలు డౌన్ లోడ్ చేసి... వాటిని మెమెరీ కార్డుల్లోకి ఎక్కించి సొమ్ము చేసుకుంటున్న ఓ ఇంటర్నెట్ కేఫ్ నిర్వాహకుడిని హైదరాబాదు పశ్చిమ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి కంప్యూటర్ తో పాటు మెమరీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను టాస్క్ ఫోర్స్ డీసీపీ కోటిరెడ్డి మీడియాకు వెల్లడించారు.

హైదరాబాదు, పాతబస్తీలోని టప్పాచబుత్రకు చెందిన మహ్మద్ సర్దార్ ‘యూనివర్శల్ ఇంటర్నెట్’ సెంటర్ ను నడుపుతున్నాడు. నెట్ సెంటర్ లోని కంప్యూటర్ లో నీలి చిత్రాలను డౌన్ లోడ్ చేసుకుని వినియోగదారుల మెమెరీ కార్డుల్లో డౌన్ లోడ్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు నెట్ కేఫ్ పై దాడి చేశారు. నీలి చిత్రాలను స్వాధీనం చేసుకుని నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News