: దేశంలోని హోటళ్లకు ఇక గడ్డు కాలమే!
దేశంలో హోటల్ పరిశ్రమకు ఇక గడ్డు కాలమేనట. హోటల్ పరిశ్రమలో పునరుజ్జీవ సంకేతాలేవీ లేవని ఇండియా రేటింగ్స్ స్పష్టం చేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో కూడా హోటల్ పరిశ్రమ ఆదాయాల్లో నిలకడలేమి ఉంటుందని పేర్కొంది. ఈ పరిశ్రమ సరఫరాల పరమైన ఒత్తిడులు, రుణాలు అందని స్థితి వంటివి ఎదుర్కొనాల్సి వస్తుందని ఇండియా రేటింగ్స్ తేల్చి చెప్పింది.