: మోడీని ప్రధాని కాకుండా నిలువరించేందుకు ఏమైనా చేస్తాం: ఏబీ బర్దన్
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని నిలువరించడమే తమ ప్రధాన లక్ష్యమని సీపీఐ జాతీయ నేత ఏబీ బర్దన్ అన్నారు. మోడీని ప్రధాని కాకుండా చేసేందుకు, అవసరమైతే బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో చేతులు కలిపేందుకు సైతం తాము సిద్ధమని ఆయన అన్నారు. ఢిల్లీలో ఇవాళ బర్దన్ మీడియాతో మాట్లాడుతూ... మోడీ ప్రధాని కాకుండా ఉండేందుకు ఏమైనా చేస్తామని చెప్పారు. ఎన్డీయే కూటమికి 210 స్థానాలకు మించి రావని ఆయన అభిప్రాయపడ్డారు.
వామపక్షాలతో మమతా బెనర్జీకి రాజకీయ వైరం ఉన్న సంగతి తెలిసిందే. వామపక్షాల కంచుకోటగా భావించే పశ్చిమ బెంగాల్ లో వామపక్ష కూటమి సుదీర్ఘ పాలనకు తృణమూల్ చరమగీతం పాడి రికార్డు సృష్టించింది. 2011లో లెఫ్ట్ పార్టీలను గద్దె దింపిన తర్వాత కూడా మమత వారిపై తన పోరాటం ఆపలేదు.