: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులను అడ్డుకున్న స్థానికులు
తెలంగాణ ప్రాంతంలో అత్యంత కీలకమైన ప్రాజెక్టుల్లో ఒకటైన ప్రాణహిత-చేవెళ్ల పనులను స్థానికులు అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పనులను కొనసాగించడానికి తాము ఒప్పుకోమని ఆదిలాబాద్ జిల్లా భీమిని మండలానికి చెందిన నాయకిని పేట, మెట్ పల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తమకు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని... ఆ వ్యవహారం పూర్తయిన తర్వాతనే పనులను చేపట్టాలని డిమాండ్ చేశారు.