: లొంగిపోయిన బీజేపీ నేత గిరిరాజ్ సింగ్... బెయిల్ మంజూరు


భారతీయ జనతా పార్టీ నేత గిరిరాజ్ సింగ్ బీహార్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఇవాళ లొంగిపోయారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన గిరిరాజ్ పై కేసు నమోదైన విషయం విదితమే. ఆయన లొంగిపోవడంతో బీహార్ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మద్దతుదారుడైన గిరిరాజ్ బీహార్ రాష్ట్రంలోని నవాడా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. నరేంద్ర మోడీని వ్యతిరేకించే వారు భారత్ ను వదిలి పాకిస్థాన్ కు వెళ్లిపోవాలంటూ జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గిరిరాజ్ సింగ్ పై ఎన్నికల కమిషన్ కేసు నమోదు చేసింది.

  • Loading...

More Telugu News