: విశ్వవ్యాప్తంగా 300 కోట్లకు చేరనున్న నెటిజన్లు
విశ్వవ్యాప్తంగా నెటిజన్లు (ఇంటర్నెట్ ను వాడేవారు) ఈ ఏడాది చివరి నాటికల్లా 300 కోట్లకు చేరనున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరుగుతోందని ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి విభాగమైన ఇంటర్నేషనల్ టెలి కమ్యూనికేషన్స్ యూనియన్ (ఐటీయూ) లెక్కల ప్రకారం... 2014 చివరికల్లా ప్రపంచంలోని 44 శాతం నివాసాలకు ఇంటర్నెట్ చేరువవుతోందట.