: హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ను గుర్తించిన సాక్షులు


2002లో ఓ వ్యక్తి చనిపోవడానికి, కొంతమందికి గాయాలు కావడానికి కారణమైన 'హిట్ అండ్ రన్' కేసులో నటుడు సల్మాన్ ఖాన్ మరిన్ని చిక్కుల్లో పడ్డాడు. ఈ కేసు ఈ రోజు ముంబయి కోర్టులో విచారణ జరగగా, ఇద్దరు సాక్షులు సల్మాన్ ను గుర్తించారు. ఘటన జరిగిన రోజు రాత్రి సల్మాన్ ను చూశానని, అప్పుడే కారు నుంచి సల్లూ బయటికి దిగాడని, అర్ధరాత్రి 2.45 సమయంలో ఆ దురదృష్టకర ఘటన జరిగిందని మొదటి సాక్షి 24 ఏళ్ల మహ్మద్ ముస్లిం షేక్ తెలిపాడు. తామంతా నిద్రపోతుండగా ఒక్కసారే శబ్దం వినపడటంతో లేచామని చెప్పాడు. తన ఎడమవైపు నుంచే కారు వెళుతుండగా చూశానని, చాలామంది గుమిగూడారని వివరించారు. కారులో వున్నది సల్మాన్ అని అక్కడివారు అన్నట్లు వెల్లడించాడు. గతవారం ఇదే కేసు విచారణలో మరోసాక్షి పలు విషయాలను తెలిపాడు. ఈ కేసులో సల్మాన్ దోషిగా రుజువైతే పదేళ్ల జైలు శిక్ష పడుతుంది.

  • Loading...

More Telugu News