: బ్రిట్నీ స్పియర్స్ ను కలిసిన ప్రియాంక చోప్రా
ప్రముఖ పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్ ను బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా లాస్ వెగాస్ లో కలిశారు. సరెండర్ నైట్ క్లబ్ లో జరిగిన మ్యూజికల్ నైట్ లో పాల్గొనేందుకు ప్రియాంక చోప్రా లాస్ వెగాస్ వెళ్లింది. అనంతరం ఆమె బ్రిట్నీని కలిసింది. అంతేకాదు, ఈ అందాల భామలిద్దరూ కలసి దిగిన ఫొటోను కూడా ప్రియాంక ట్విట్టర్లో పెట్టారు. ‘ఐ కాంట్ మేక్ యూ లవ్ మీ’ అనే మూడవ ఆల్బమ్ ను ప్రియాంక చోప్రా ఈ సందర్భంగా విడుదల చేశారు.