: టాట్రా కేసులో ఆంటోనీ, పీఎం సలహాదారు వాంగ్మూలం నమోదు
టాట్రా ట్రక్కుల కేసులో సాక్షులుగా ఉన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ, ప్రధానమంత్రి సలహాదారు టీకే నాయర్ వాంగ్మూలాన్ని సీబీఐ రికార్డు చేసింది. పదహారు వందల ట్రక్కులు కొనుగోలు చేసేందుకే తనకు రూ.14 కోట్లు లంచం ఇచ్చేందుకు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ తేజేందర్ సింగ్ ఆఫర్ చేశారంటూ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ రెండేళ్ల కిందట ఆరోపణలు చేశారు. ఆ వెంటనే కేసు నమోదు చేసిన సీబీఐ అప్పటి నుంచీ దర్యాప్తు చేస్తూనే ఉంది.