: విశాఖలో అరాచక శక్తులు గెలవకూడదు: సబ్బం హరి
విశాఖ నుంచి స్థానికేతరులు పోటీ చేయడానికి తాను వ్యతిరేకమని జేఎస్పీ నేత సబ్బం హరి స్పష్టం చేశారు. వైకాపా అధినేత జగన్ తన తండ్రి స్థానమైన కడప స్థానాన్ని తన తల్లి విజయమ్మకు కేటాయించవచ్చని... కానీ, అన్ని రకాల వనరులు గలిగిన విశాఖను తన తల్లికి కేటాయించారని ఆరోపించారు. విజయమ్మను విశాఖ నుంచి నిలబెట్టడం వెనుక జగన్ కు ఓ రహస్య అజెండా ఉందని తెలిపారు. విశాఖలో విజయమ్మ గెలిస్తే... ఇక్కడ అరాచకం రాజ్యమేలుతుందని, ఇప్పటి దాకా నెలకొన్న శాంతి మటుమాయమవుతుందని హెచ్చరించారు. అరాచక శక్తులు విశాఖ నుంచి ప్రజాప్రతినిధులు కాకూడదని ఓటర్లకు పిలుపునిచ్చారు.