: రాళ్లతో కొట్టుకున్న టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు
అనంతపురం జిల్లాలోని లేపాక్షి మండలం గొంగటపల్లిలో టీడీపీ, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ శ్రేణుల వాహనాలను పోలీసులు నిలిపేశారు. ఇంతలో టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. ఇరువర్గాలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.