: కన్నడను బోధనా బాషగా చేయడం హక్కుల ఉల్లంఘనే: సుప్రీంకోర్టు


సుప్రీంకోర్టు ఈ రోజు ఒక చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. కన్నడను ప్రాథమిక స్కూళ్లలో బోధనా భాషగా అమలు చేయాలన్న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను తప్పుబట్టింది. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని అంటూ సదరు ఆదేశాలను రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేసింది. ఇదే అంశంపై లోగడ కర్ణాటక హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఆ రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా... చివరికి అక్కడా ఫలితం దక్కలేదు. కర్ణాటక సర్కారు ఆదేశాలను వ్యతిరేకిస్తూ సుమారు 1,800 ప్రైవేటు ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు కూడా ఉమ్మడిగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి. కన్నడ భాష గొప్పతనాన్ని తాము ప్రశ్నించడం లేదని, ఇంగ్లిష్ ఎంతో అవసరమని, చిన్నారులు దాన్ని కోల్పోరాదని వాదించాయి. మాతృభాషలో బోధించడం వల్ల వారి కెరీర్ అవకాశాలు మెరుగుపడవని నివేదించాయి. వీరి తరపున న్యాయవాది కేవీ ధనుంజయ వినిపించిన సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు పై ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News