: టీడీపీ, బీజేపీల నుంచి నాకు ఆహ్వానాలు అందాయి: సబ్బం హరి
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ఎంతో పోరాడామని... జేఎస్పీ అధినేత కిరణ్ చాలా కృషి చేశారని జేఎస్పీ నేత సబ్బం హరి చెప్పారు. తనతో పాటు లగడపాటి, ఉండవల్లి, హర్షకుమార్ లు విభజనను అడ్డుకునేందుకు ఎంతో ప్రయత్నించారని చెప్పారు. విభజనపై సుప్రీంకోర్టు స్టే ఇస్తుందని భావించామని... కానీ, నిన్నటి సుప్రీం తీర్పుతో రాష్ట్ర విభజన ఆగదన్న విషయం తేలిపోయిందని తెలిపారు. తన 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని చెప్పారు. తనకు టీడీపీ, బీజేపీలోకి రావాలన్న ఆహ్వానాలు అందాయని... కానీ, సమైక్య రాష్ట్రం కోసం పోరాడిన తాను జై సమైక్యాంధ్ర పార్టీలో చేరానని తెలిపారు. కానీ, రాష్ట్ర విభజన ఖాయమని (సుప్రీం తీర్పుతో) తేలిపోయన నేపథ్యంలో, ఇంకా ఎవరిపై పోరాడాలని అనిపించిందని చెప్పారు.