: అక్కడ సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ పహారా కాస్తున్నాయి: విశాఖ ఎస్పీ
విశాఖజిల్లాలోని ఏజెన్సీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతకు సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ దళాలను వినియోగిస్తున్నామని విశాఖ జిల్లా రూరల్ ఎస్పీ తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ, ఏజెన్సీలో రవాణా సౌకర్యం సరిగా లేని ప్రాంతాల్లో భద్రత కల్పించేందుకు స్పెషల్ ఫోర్స్ సిద్ధంగా ఉందని, పోలింగ్ అధికారులను తరలించేందుకు, పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.