: సుప్రీం తీర్పుతో ఉన్నత స్థాయి అధికారులకు ఇక ముచ్చెమటలే
జాయింట్ సెక్రటరీ పైస్థాయి అధికారులను క్రిమినల్ కేసుల్లో విచారించేందుకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ అనుమతి అవసరాన్ని తప్పనిసరి చేస్తున్న ఢిల్లీ పోలీస్ చట్టంలోని సెక్షన్ 6ఏను కొట్టివేసింది. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. విచారణ విషయంలో సీనియర్, జూనియర్ అధికారుల మధ్య వివక్షకు సెక్షన్ 6ఏ కారణమవుతుందని, దాన్ని తొలగించాలని కోరారు. దీంతో ఈ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసింది.