: దక్షిణాఫ్రికా అధ్యక్షుడి భార్యపై అత్యాచారం
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా ఓ సంచలన విషయాన్ని బయట పెట్టారు. తాను 2009లో దక్షిణాఫ్రికా అధ్యక్ష పగ్గాలు చేపట్టకముందు, పదేళ్ల క్రితం క్వాజుల్ నాటల్ ప్రాంతంలోని తన నివాసంలోకి కొందరు ప్రవేశించి తన భార్యపై అత్యాచారం చేశారని తాజాగా వెల్లడించారు. నిందితులను పట్టుకోవడం, దోషులగా తేల్చడం కూడా జరిగిపోయిందని చెప్పారు. అయితే, తన నలుగురు భార్యల్లో ఎవరు అత్యాచారానికి గురయ్యారన్న విషయాన్ని ఆయన చెప్పలేదు. బుధవారం జరగబోయే ఎన్నికల్లో మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికవుతానని జుమా ఆశలు పెట్టుకున్నారు.