: దమ్ముంటే ప్రియాంక విషయంలో ఇలాగే వ్యవహరించండి: ఆప్ అభ్యర్థి
తన కుటుంబ సభ్యులను అమేథీ విడిచి వెళ్లాలంటూ పోలీసులు బెదిరించారని... అమేథీలో రాహుల్ ప్రత్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేస్తున్న కుమార్ విశ్వాస్ తెలిపారు. నిన్న రాత్రి తాము ఉంటున్న నివాసానికి పోలీసులు వచ్చారని... తన భార్య, సోదరిని బెదిరించారని చెప్పారు. అయితే, ఎన్నికల నిబంధనల ప్రకారం, ప్రచారం ముగిశాక నియోజకవర్గంలో ఓట్లు లేనివారు, ప్రచారకర్తలు ఆ నియోజకవర్గంలో ఉండరాదని పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై మండిపడుతున్న కుమార్ విశ్వాస్... దమ్ముంటే ఇదే విధంగా రాహుల్ సోదరి ప్రియాంక పట్ల వ్యవహరించాలంటూ పోలీసులకు సవాల్ విసిరారు.