: ఈ వజ్రపుటుంగరం వెల రూ.420 కోట్లు
సాధారణంగా బంగారం లేదా వెండి ఉంగరంపై వజ్రాన్ని పొదగడం తెలిసిందే. కానీ, అసలు వేరే ఏ లోహంతో పని లేకుండా పూర్తిగా 100 శాతం స్వచ్ఛమైన 150 కేరట్ల డైమండ్ రింగ్ ను తయారు చేశారు. వజ్రాన్నే వేలికి ధరించేలా మలిచారు. మధ్యలో చిన్న రంధ్రం కూడా ఉంది. జెనీవాకు చెందిన స్విస్ జ్యుయెలర్స్ దీన్ని రూపొందించింది. వెల 7 కోట్ల డాలర్లు. మన కరెన్సీలో అయితే సుమారు 420కోట్ల రూపాయలు.