: రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన లలిత్ మోడీ
ఐపీఎల్ రూపశిల్పి, భారత క్రికెట్ కు కార్పొరేట్ హంగులద్దిన స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ జీనియస్ లలిత్ మోడీ తన పునరాగమనాన్ని ఘనంగా ప్రారంభించారు. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. డిసెంబర్ 19న జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను కోర్టు ఆదేశాల మేరకు వెల్లడించలేదు. అయితే, ఎన్నికల ఫలితాలను వెల్లడించాలని గత వారం సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో, జైపూర్లోని కోర్టు సమక్షంలో ఎన్నికల ఫలితాలు గల సీల్డ్ కవర్ ను ఈ రోజు ఓపెన్ చేశారు. అయితే మోడీ పదవిని చేపట్టడానికి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నట్టుగా తెలుస్తోంది. బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ తో మోడీకి వ్యక్తిగత వైరం ఉంది. దీనికి తోడు ఐపీఎల్ అవకతవకలపై మోడీ కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అరెస్టుల భయంతో ఆయన ఇండియాను వీడి యూకేలో ఉంటున్నారు.