: ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన విజయమ్మ


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, విశాఖ ఎంపీ అభ్యర్థి వైఎస్ విజయమ్మ ఎన్నికల కోడ్ ను అతిక్రమించారు. క్రైస్తవ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో విశాఖలోని ఓ స్టార్ హోటల్ లో ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పాల్గొన్న విజయమ్మ మాట్లాడుతూ... చిన్న చిన్న పాస్టర్లకు సాయం చేస్తామని, మూడు నుంచి ఐదు వేల వరకు నగదు ఇస్తామని చెప్పారు. బరియల్ గ్రౌండ్స్, చర్చిల నిర్మాణం చేపడతామన్నారు. క్రైస్తవులంతా వైఎస్సార్సీపీకే ఓటు వేయాలంటూ ఆమె విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News