: తెలంగాణలో అకాల వర్షం... అన్నదాతల ఆందోళన
హైదరాబాదు సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం ఈదురుగాలులు వీచాయి. నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లి, గోవిందపల్లిలో వడగళ్ల వాన కురిసింది. కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలంలోనూ భారీ వర్షం పడింది. చాలా గ్రామాల్లో వర్షపు నీటిలో వరికుప్పలు తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. నడి వేసవిలో కురిసిన అకాల వర్షంతో చేతికందిన పంట నీట మునిగిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.