: అమేథీలో కనీస వసతులు కూడా లేవు: మనోహర్ పారికర్


అమేథీలో కనీస వసతులైన నీరు, విద్యుత్ సౌకర్యాలు వంటివి సరిగా లేవని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అన్నారు. అమేథీలో పర్యటించినప్పుడు అక్కడి పరిస్థితులను చూసి షాక్ కు గురయ్యానని అన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ నియోజకవర్గంలో ఇటీవల బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ తరపున పారికర్ ప్రచారం నిర్వహించారు.

"అమేథీలో పర్యటించినప్పుడు నిజంగా షాక్ కు గురయ్యాను. అక్కడ కనీస వసతులు సరిగా లేవు. కేవలం 3-4 గంటలు మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉంది. సరైన నీటి సరఫరా కూడా లేదు" అని పారికర్ అన్నారు. ఎంపీ నిధుల్లో కేవలం 51 శాతం మాత్రమే వినియోగించారని ఆయన చెప్పారు.

గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేథీలో జరుగనున్న ఎన్నికల్లో ముక్కోణపు పోటీ నెలకొంది. బీజేపీ నుంచి స్మృతి ఇరానీ, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కుమార్ విశ్వాస్ పోటీ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News