: చెన్నై పేలుళ్లలో మృతి చెందిన స్వాతికి దక్షిణ మధ్య రైల్వే నివాళి
కొన్ని రోజుల కిందట చెన్నైలో జరిగిన బాంబు పేలుళ్లలో మరణించిన గుంటూరు జిల్లాకు చెందిన స్వాతి అనే టీసీఎస్ ఉద్యోగినికి దక్షిణ మధ్య రైల్వే ఘన నివాళి అర్పించింది. ఇకపై ప్రతి ఏటా మే నెలలో మొదటి పని దినాన్ని ఆమె పేరిట స్మారక దినంగా ప్రకటిస్తామని తెలిపింది. చెన్నై పేలుళ్లలో స్వాతి ఒక్కతే చనిపోగా పద్నాలుగు మంది గాయపడ్డారు.