: కేజ్రీవాల్ కు మద్దతుగా వారణాసికి శరద్ యాదవ్ వస్తున్నారు!
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తోన్న వారణాసిలో ఎన్నికల ప్రచారానికి జేడీయూ అధినేత శరద్ యాదవ్ సిద్ధమవుతున్నారు. కేజ్రీవాల్ కు మద్దతుగా శరద్ యాదవ్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. వారణాసిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పోటీ చేస్తున్న విషయం విదితమే. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం శరద్ యాదవ్ ఎన్డీయే కూటమితో తెగతెంపులు చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఈ నెల 12న పోలింగ్ జరగనుంది.