: 30 ఏళ్లకే కన్నుమూసిన మాజీ టెన్నిస్ క్రీడాకారిణి


ఒకప్పటి బ్రిటిష్ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి 30 ఏళ్ల ఎలెనా బాల్తచా క్యాన్సర్ కు చికిత్స పొందుతూ మరణించింది. లండన్ ఒలింపిక్స్ లో ఇంగ్లాండ్ కి ప్రాతినిధ్యం వహించిన ఎలెనా 2013 చివర్లో టెన్నిస్ కి వీడ్కోలు పలికింది. చాలాకాలంగా తనకు కోచ్ గా వ్యవహరించిన వ్యక్తిని పెళ్లాడిన ఎలెనా రెండు వారాలకే అనారోగ్యానికి గురైంది. దీంతో ఆసుపత్రిలో చేరిన ఎలెనాకు క్యాన్సర్ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. నాలుగు నెలలుగా చికిత్స పొందుతున్న ఆమె సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ప్రశాంతంగా కన్నుమూసింది.

  • Loading...

More Telugu News