: నెల్లూరును రాజధాని చేసే అవకాశం ఉంది: చిరంజీవి
నెల్లూరును సీమాంధ్ర రాజధాని చేసే అవకాశం ఉందని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. ఈ రోజు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను కోరారు. చంద్రబాబు, జగన్ ల మాటలు విని మోసపోరాదని సూచించారు. వైఎస్సార్సీపీకి ఓటేస్తే మోడీకి వేసినట్టే అని తెలిపారు.