: చిన్మయి పెళ్లికూతురాయెనే!
ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద పెళ్లికూతురుగా ముస్తాబై నటుడు రాహుల్ రవీంద్రన్ తో తాళి కట్టించుకుంది. ఇవాళ చెన్నైలో దక్షిణ భారత సాంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
గత కొంతకాలంగా రాహుల్, చిన్మయి ప్రేమించుకుంటున్నారని మీడియాలో వార్తలు వెలువడ్డాయి. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన చిన్మయి... సమంత, సమీరారెడ్డి, కాజల్ అగర్వాల్ లకు గాత్రదానం చేశారు. చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలోని ‘తిత్లీ’, మస్తమగన్ 2 స్టేట్స్ సినిమాలోని పాటలు చిన్మయికి దేశవ్యాప్తంగా గుర్తింపును తీసుకొచ్చాయి. రాహుల్ తమిళంలో వణక్కం చెన్నై, తెలుగులో 'అందాల రాక్షసి' సినిమాలతో గుర్తింపు పొందారు.