: టీవీ ఛానళ్లలో ప్రచార గడువు పరిసమాప్తి
సీమాంధ్ర ఎన్నికలకు సంబంధించి టీవీ ఛానళ్లలో ప్రచార గడువు ముగిసింది. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ఛానళ్లలో ప్రచారం పరిసమాప్తి అయింది. అయితే, ఇంటింటి ప్రచార కార్యక్రమం మాత్రం సాయంత్రం ఆరు గంటలకు ముగించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు హెచ్చరించారు.
ఈ నెల 7వ తేదీ, బుధవారం నాడు సీమాంధ్ర ప్రాంతంలోని 25 లోక్ సభ, 175 శాసన సభ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది. ఎన్నికల నేపథ్యంలో సీమాంధ్ర వ్యాప్తంగా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. తనిఖీల్లో భారీగా మద్యం, నగదును పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకుంటున్నారు.