: మరో ఉత్కంఠ సమరానికి కోల్ కతా, రాజస్థాన్ రెడీ
ఐపీఎల్-7లో క్రికెట్ మజాను చూపించిన కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ జట్లు మరోసారి ఉత్కంఠ పోరుకు సిద్ధమయ్యాయి. యూఏఈలో జరిగిన తొలి విడత మ్యాచ్ లలో రోమాంఛిత ఇన్నింగ్స్ రుచి చూపించిన ఇరు జట్లు మరో మారు అభిమానులను అలరించేందుకు ఆహ్మదాబాద్ లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో తలపడుతున్నాయి.
గత మ్యాచ్ లో నువ్వా? నేనా? అనేలా ఆడి మ్యాచ్ ను టైగా ముగించాయి ఈ రెండు జట్లు. నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ ఆడాయి. దానిని కూడా టైగా ముగించాయి. దీంతో మ్యాచ్ లో కొట్టిన బౌండరీలను లెక్కించి, విజేతను ప్రకటించారు. దీంతో ఈ మ్యాచ్ పై అభిమానుల అంచనాలు పెరిగిపోయాయి. టాస్ గెలిచిన కోల్ కతా ఫీల్డింగ్ ఎంచుకుంది.