: పవన్ కల్యాణ్! తప్పుడు మాటలు మానుకో: వాసిరెడ్డి పద్మ
పవన్ కల్యాణ్ కు పిచ్చి ముదిరిందని, ఇకనైనా పవన్ తప్పుడు మాటలను మానుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ తన తప్పుడు మాటలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
అధికారం కోసం చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారని పద్మ అన్నారు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని, సీమాంధ్రలో కాపులకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానంటూ బాబు ఆశపెడుతున్నారని పద్మ ఆరోపించారు. బీసీలకు ఎన్ని సీట్లు కేటాయించారని చంద్రబాబును ఆమె ప్రశ్నించారు. నగదు, మద్యం విచ్చలవిడిగా పంచుతూ అధికారంలోకి రావాలని బాబు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.