: జగన్ ప్రచారశైలి రైతులకు భయాందోళన కలిగిస్తోంది: రావుల
వైకాపా అధినేత జగన్ ఎన్నికల ప్రచార శైలి రైతులకు భయాందోళన కలిగిస్తోందని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. జగన్ రాజకీయాలు స్టాక్ మార్కెట్ తరహాలో ఉంటాయని... ఆయనకు స్వీయలాభం తప్ప మరేమీ అవసరం లేదని ఆరోపించారు. ఈ రోజు హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ కు తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియదని ఎద్దేవా చేశారు. జగన్ అధికారంలోకి వస్తే సీమాంధ్రలో ఏమీ మిగలదని తెలిపారు.