: ఢిల్లీలో తల్లీ కొడుకుల పాలన... యూపీలో తండ్రీ కొడుకుల పాలనకు స్వస్తి చెప్పండి: మోడీ
ఢిల్లీలో తల్లీ కొడుకుల పాలన, యూపీలో తండ్రీ కొడుకుల పాలనకు చరమగీతం పాడాలని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఉత్తరప్రదేశ్ లోని అంబేద్కర్ నగర్ లో నిర్వహించిన ర్యాలీలో మోడీ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించిన మోడీ... కాంగ్రెస్ పథకాలకు గాంధీ, నెహ్రూ పేర్లేనా, పటేల్ పేరు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఒక కుటుంబం పటేల్ ను అవమానించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.