: మోడీ ఫైజాబాద్ ర్యాలీలో రాముడి ఫొటోలు... వివాదాస్పదం


ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లో నిర్వహించిన నరేంద్ర మోడీ ర్యాలీ వివాదాస్పదమయ్యేలా ఉంది. అయోధ్యకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈ మధ్యాహ్నం జరిగిన బహిరంగ సభ వెనుక రాముడి ఫొటోలను ఉంచడం వివాదం రేపుతోంది. మోడీ ప్రసంగిస్తున్న సమయంలో 'జై శ్రీరామ్' అంటూ కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేశారు. ఇక మోడీ మాట్లాడుతూ, రాముడి స్థలంలో ప్రజలు కమలాన్ని ఆహ్వానిస్తున్నారని చెప్పారు. వెంటనే ఈ అంశాలపై స్పందించిన యూపీ ఎన్నికల సంఘం నివేదిక సమర్పించాలంటూ అధికారులను కోరింది.

  • Loading...

More Telugu News