: రెండు నౌకలు ఢీ... 12 మంది గల్లంతు
చైనా సరిహద్దు జలాల్లో రెండు రవాణా నౌకలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక నౌక మునిగిపోవడంతో ఒకరు మృతి చెందగా, మరో 12 మంది గల్లంతయ్యారు. ఈ ఉదయం హాంగ్ కాంగ్ సమీపంలోని పోతాయ్ ఐలాండ్ వద్ద ఇది జరిగింది. రెండు నౌకలు ఢీకొన్నాయని, ఒకటి మునిగిపోయిందని పోలీస్ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. గల్లంతైన 12 మంది క్రూ సిబ్బంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.