: సున్నపురాళ్లపల్లెలో ఉద్రిక్తత...పోలీసు బలగాల మోహరింపు
కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో చిట్టచివరకు పోలీసుల సహాయంతో టీడీపీ నేతలు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. టీడీపీ నేతలు గ్రామంలోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ఊరి బయటే వైఎస్సార్సీపీ కార్యకర్తలు వేచి ఉండడంతో టీడీపీ నేతలకు భద్రత కల్పించాలని పోలీసులను కలెక్టర్ ఆదేశించారు. దీంతో టీడీపీ నేతలు సున్నపురాళ్లపల్లెలో ప్రచారం చేస్తున్నారు.