: ఇంటి ముందుకు ఇంజినీరింగ్ విద్య
ఇప్పటివరకు సాంకేతిక విద్యను కళాశాలల్లో అభ్యసించే విద్యగానే పరిగణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సంప్రదాయానికి డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ మంగళం పాడనుంది. త్వరలోనే ఇంజినీరింగ్ కోర్సులను కూడా దూరవిద్య విధానం ద్వారా అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు యూనివర్శిటీ రిజిస్ట్రార్ సుధాకర్ వెల్లడించారు.
ఇందుకోసం ఇతర ప్రభుత్వ వర్శిటీల ల్యాబ్ సౌకర్యాలను వినియోగించుకుంటామని తెలిపారు. కాగా, ఈ ఏడాది నుంచి జర్నలిజంలో పీజీ కోర్సు, ఇంటర్నేషనల్ మాస్టర్ డిగ్రీ ప్రోగ్రాం, ఫార్మా కంపెనీల సహకారంతో బీఎస్సీ ఫార్మాస్యూటికల్ సైన్స్ కోర్సులు ప్రవేశపెడుతున్నట్టు ఆయన వివరించారు.