: గొడవలు జరిగితే పోలీసుకు చెప్పే సాఫ్ట్ వేర్
ఎక్కడ ఎలాంటి గొడవలు జరిగినా తక్షణం తెలియజేసే సాఫ్ట్ వేర్ ఒకదాన్ని రాష్ట్ర పోలీసులు సీమాంధ్ర పోలింగ్ రోజున వినియోగించుకోనున్నారు. ఇప్పటికే దీన్ని తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో పోలింగ్ సందర్భంగా పరీక్షించి చూడగా సత్ఫలితాలు వచ్చాయి. ఈ సాఫ్ట్ వేర్ తో పోలీసు శాఖలో దిగువ స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరి మొబైల్స్ ను అనుసంధానిస్తున్నారు. దాంతో ఎక్కడ ఘర్షణలు తలెత్తినా ఉన్నతాధికారులకు క్షణాల్లోనే సమాచారం వెళ్లిపోతుంది.