: ఆ రుణం తీర్చుకునేందుకు ఒక్క అవకాశం ఇవ్వండి: షర్మిల
వైఎస్ మరణానంతరం రాష్ట్ర ప్రజలు తమ కుటుంబానికి అండగా ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. వైఎస్ విజయమ్మ, షర్మిల ఇవాళ విశాఖలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మధురవాడలో జరిగిన సభలో షర్మిల పాల్గొని ప్రసంగించారు. సోనియాగాంధీ కక్ష గట్టి జగనన్నను జైల్లో పెట్టించారని షర్మిల అన్నారు. వైఎస్ పథకాలు కొనసాగాలంటే జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ రాజశేఖరరెడ్డిని రెండు సార్లు సీఎం చేశారని, ఆ రుణం తీర్చుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. విజయమ్మను గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.