: ఉండవల్లి విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు


రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను ఈ రోజు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారించింది. దాఖలైన మొత్తం 24 పిటిషన్లలో ఒక పిటిషన్ ను ఉండవల్లి అరుణ్ కుమార్ వేశారు. విచారణ సందర్భంగా ఉండవల్లి తన పిటిషన్ ను తానే వాదించుకున్నారు. తెలంగాణ ఏర్పాటు న్యాయబద్ధంగా జరగలేదని... పార్లమెంటు తలుపులు మూసేసి, లైవ్ టెలికాస్ట్ కట్ చేసి, ఎంపీలను గెంటివేసి రాష్ట్రాన్ని విభజించారని ఈ సందర్భంగా ఉండవల్లి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా, జూన్ 2వ తేదీ అపాయింటెడ్ డేను నిలిపివేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే, ఉండవల్లి విజ్ఞప్తిని సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది.

  • Loading...

More Telugu News