: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 130 సీట్లు ఖాయం: వైఎస్ భారతి
ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రాంతంలో 130 సీట్లు గెలుచుకోవడం ఖాయమని వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి ధీమా వ్యక్తం చేశారు. జనం గుండెల్లో ఇప్పటికీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నారని ఆమె చెప్పారు. ప్రచార సభలకు వస్తున్న ప్రజల్లో ఉప్పొంగుతున్న అభిమానాన్ని చూస్తే ఈ విషయం స్పష్టమవుతున్నదని ఆమె అన్నారు. ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.
కడప జిల్లాలో భారతి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న విషయం విదితమే. జగన్, అవినాష్ రెడ్డికి మద్దతుగా ఆమె ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పులివెందులతో పాటు పలు ప్రాంతాల్లో భారతితో పాటు ఇతర కుటుంబసభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు.