: ఫ్లోరోసిస్ సమస్య కూడా సీమాంధ్రుల వల్లే వచ్చిందా?: పవన్ కల్యాణ్
సీమాంధ్రులు వెళ్లిపోవాలి, సీమాంధ్రులను తెలంగాణ నుంచి వెళ్లగొట్టాలి అని కేసీఆర్ పిలుపునిస్తుంటే సమస్య ఎక్కడుందో అని ఆలోచించానని పవన్ కల్యాణ్ తెలిపారు. చిత్తూరులో ఆయన మాట్లాడుతూ, నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య కూడా సీమాంధ్రులే సృష్టించారా? అని ఆయన ప్రశ్నించారు. పాలమూరు నుంచి సీమాంధ్ర ప్రజల వల్లే వలసలు వెళ్లిపోతున్నారా? అని ఆయన కేసీఆర్ ను నిలదీశారు.
సీమాంధ్ర ప్రజలు అన్యాయం చేశారని అన్నప్పుడు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా ఉన్న తెలంగాణ నేతలంతా ఏం చేశారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రాష్ట్రం ఇచ్చిన తరువాత కూడా కేసీఆర్ సీమాంధ్రులను తిడుతూంటే దేశ సమగ్రతకు దెబ్బతగులుతుందని భావించి తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అన్నారు. పార్లమెంటులో మన ఎంపీలను దారుణంగా అవమానించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.