: ఫేస్ బుక్ లో ఫేక్ అకౌంట్లు 10 కోట్లు


ప్రముఖ సామాజిక వేదిక ఫేస్ బుక్ లో ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్లకు పైనే నకిలీ అకౌంట్లు ఉన్నాయట. ఈ విషయాన్ని ఫేస్ బుక్ స్వయంగా వెల్లడించింది. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఫేక్ అకౌంట్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. వీటికితోడు కోటిన్నర వరకూ అవాంఛనీయ అకౌంట్లు కూడా ఉన్నట్లు తెలిపింది. మొత్తం అకౌంట్లలో నకిలీవి 4.3 శాతం నుంచి 7.9 శాతం వరకు ఉంటాయని ఫేస్ బుక్ అంచనా. కొందరు ఒకటికి మించి అకౌంట్లు కలిగి ఉన్నారని, ఇది తమ నిబంధనలకు వ్యతిరేకమని ఫేస్ బుక్ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News