: ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయండి: ఆర్.కృష్ణయ్య
సీమాంధ్ర, తెలంగాణలో టీడీపీని గెలిపించాలంటూ ఆ పార్టీనేత, తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్.కృష్ణయ్య తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ మేరకు విజయవాడలో ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కుల, మత, ప్రాంతాలను పక్కనబెట్టి టీడీపీనే గెలిపించాలని కోరారు. ప్రలోభాలకు లొంగకుండా యువత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఆయన బీసీ నేత కావడంతో బీసీలంతా తెలుగుదేశానికే ఓటు వేయాలని పునరుద్ఘాటించారు. బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నా, కొత్త రాజధాని నిర్మించాలన్నా ఆ పార్టీ నేత చంద్రబాబుకే సాధ్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ అసమర్థ పాలనలో వేలకోట్ల కుంభకోణాలు జరిగాయన్న కృష్ణయ్య, వారి పాలనలోనే పారిశ్రామిక ఉత్పత్తి తగ్గిపోయిందని చెప్పారు. అవినీతితో రాష్ట్రాన్ని భ్రష్ట్రుపట్టించిందీ కాంగ్రెస్సేనని అన్నారు. దేశ, రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే మోడీ, బాబు పాలన రావాలన్నారు.